ఇందిరమ్మ ఇళ్లపై నేడు బిగ్ అప్డేట్

TG: నగరంలోని పోచారం NIG కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో 43 కోట్ల 20 లక్షలతో 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. లబ్ధిదారులకు ఫ్లాట్ నంబర్ల కేటాయింపునకు లాటరీ నిర్వహిస్తారు. తొలి విడతలో లక్ష చెల్లించిన వారికి బ్యాంకు NOCలు, డ్రా తర్వాత అలాట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు. లబ్ధిదారులు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, ఐడి కార్డుతో రావాలని సూచించారు.



