← Back to news

రైతుకు పూర్తి పరిహారం ఇవ్వాలి: బీఎస్పీ

By Thukaram Anumula· 15h ago
రైతుకు పూర్తి పరిహారం ఇవ్వాలి: బీఎస్పీ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 161వ జాతీయ రహదారి భూసేకరణతో భూమి కోల్పోతున్న ర్యాలమడుగు గ్రామానికి చెందిన రైతు బ్యాగరి బాబుకు నిబంధనల ప్రకారం పూర్తి నష్టపరిహారం అందించాలని బీఎస్పీ నారాయణఖేడ్ అధ్యక్షుడు అనుముల తుకారం డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 94/2/1లోని భూమితోపాటు రైతు వినియోగంలో ఉన్న బోరు, పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి పరిహారం చెల్లించాలని కోరారు. భూసేకరణకు సంబంధించిన వివరాలతోపాటు ఇప్పటికే చెల్లించిన, ఇంకా చెల్లించాల్సిన పరిహారంపై స్పష్టమైన లెక్కలు చెప్పాలని కోరారు.

More in Local