జ్ఞానేశ్ కో హటావో–దేశ్ బచావో: పొన్నం ప్రభాకర్
TG: ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలంతా సంఘటితంగా పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని, ముఖ్యంగా SC, ST, BC, మైనార్టీ ఓట్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. “ఓట్ బచావో–దేశ్ బచావో, జ్ఞానేశ్ కో హటావో–దేశ్ బచావో” నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, విపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని మంత్రి ఖండించారు.

