← Back to news

ధర్మవరం RTC డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు

By Bala· 6h ago
ధర్మవరం RTC డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు

సత్యసాయి జిల్లా ధర్మవరం RTC డిపోలో ఆన్‌కాల్, డైలీ వేజెస్ ప్రాతిపదికన డ్రైవర్లను తీసుకోనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధర్మవరం RTC డిపోలోని మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఖాళీలకు సంబంధించిన వివరాలను అక్కడే తెలుసుకోవచ్చని తెలిపారు.

More in Local