సైబర్ మోసాల బాధితులకు భారీ రిలీఫ్!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణలో 24,189 మంది సైబర్ బాధితులకు 139 కోట్ల 68 లక్షల రూపాయల రీఫండ్ చేయించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB) తెలిపింది. లోక్ అదాలత్, మనీ రీస్టోరేషన్ మాడ్యూల్(MRM) ద్వారా కోర్టు ఆర్డర్లతో సంబంధం లేకుండానే ఈ సొమ్ము రికవరీ చేశారు. ఇందులో సైబరాబాద్‌లోనే అత్యధికంగా 14 కోట్ల 19 లక్షల రూపాయలను బాధితులకు చేరాయి. సైబర్ మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో '1930'కు చేస్తే రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెప్పారు.



