← Back to news

'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'

By DK· 11 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'

TG: జులై 2న ఉప్పల్ భగాయత్ భూములను భూపోరాటం ద్వారా ఆక్రమించుకుంటామని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఫైరయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ భూమి ఉద్యమకారులదేనని, భూమి కోసం కొట్లాడింది తామే అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసమే ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు.

'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'

More in Politics