ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా పలివెల రవికుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. కొత్తగూడెంలోని రైస్ గ్రాండ్ బాంకెట్ హాల్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో భద్రాచలం కోమలి స్కూల్ కరస్పాండెంట్ పలివెల రవికుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాల్వంచ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ కరస్పాండెంట్ మాగులూరి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా, ఇల్లెందు మాస్టర్ మైండ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ జక్కుల సర్వేశ్వరరావు కోశాధికారిగా ఎన్నికయ్యారు.