మహిళలందరికీ అమ్మకు అక్షరమాల లెర్నింగ్ పరీక్షలు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీదిచందుపట్ల గ్రామంలోని ZPHS పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. మహిళల్లో విద్య, అక్షరాస్యతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి CC చందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



