జోగులాంబ సన్నిధిలో మంత్రి దంపతులు

జోగులాంబగద్వాల జిల్లా అలంపూర్లో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాల బ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.





