← Back to news

జల్లేపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

By Ramesh Kondru· 1d ago· Thirumalayapalem, Tirumalayapalem, Khammam
జల్లేపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో వీరన్న యువసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పూర్తైన సందర్భంగా మూడు లడ్డూలకు వేలంపాట నిర్వహించగా మొత్తం 1,12,000 రూపాయల ధర పలికాయి. పెద్ద లడ్డూను బివివిఆర్ బ్రదర్స్ భాషబోయిన వీర వెంకటరామ్ కుటుంబ సభ్యులు 84,006 రూపాయలకు దక్కించుకున్నారు. రెండో లడ్డూను ఇండ్ల సురేష్ కుటుంబ సభ్యులు 22,016 రూపాయలకు సొంతం చేసుకున్నారు.

జల్లేపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు
జల్లేపల్లిలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు

More in Local