భార్యతో గొడవ వద్దనుకొని.. ప్రాణాలు తీసుకున్నాడు

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో విషాదం జరిగింది. హర్షిత్ అనే 31 ఏళ్ల వ్యక్తికి తన భార్యతో కొంతకాలంగా మనస్పర్థలున్నాయి. ఆరు నెలలుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల అతని భార్య ఫ్లాట్ దగ్గరికి వచ్చి తలుపు తట్టింది. మళ్లీ గొడవ జరుగుతుందనే భయంతో ఫ్లాట్ బాల్కనీ ద్వారా కింది అంతస్తులోకి దిగాలని ప్రయత్నించాడు. కాలు జారి 21వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

