బుల్లెట్ ట్రైన్ కోసం 41 రోజుల దీక్ష!

సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ దీక్ష 41వ రోజుకు చేరింది. ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష కొనసాగుతోంది. న్యాయవాది, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ దీక్షకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. NH-65 ఆనుకొని బుల్లెట్ ట్రైన్ రావాల్సిందేనని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. TRS యూత్ నాయకులు సంఘీభావం తెలిపారు.


