వ్యవసాయ విద్యుత్ కోతలు ఆపాలంటూ రాస్తారోకో

TG: వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం జతుక్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఎడ్లబండితో రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రోజుకు 9–10 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని, మోటార్లు పనిచేయక పొలాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రాంరెడ్డి ఆరోపించారు. రైతుల పంటలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.