← Back to news

హాస్టల్‌లో వసతులు అధ్వానం.. పేరేంట్స్ ఆందోళన

By Nagahar· 8h ago· Khila Warangal, Khila Warangal, Warangal
హాస్టల్‌లో వసతులు అధ్వానం.. పేరేంట్స్ ఆందోళన

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని కస్తూర్భా పాఠశాల, హాస్టల్‌లో వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌లో తాగునీటిలో నాచు, చిన్న పురుగులు వస్తున్నాయని, కుక్కలు గదుల్లోకి వచ్చి పడుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటున్నారు.

More in Local