ఎమ్మెల్సీ ఎన్నికలు: సర్వోత్తమ్కు మద్దతు

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో INC అభ్యర్థి రామ్రెడ్డి సర్వోత్తమ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా INC ప్రతినిధుల సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, అభ్యర్థి సర్వోత్తమ్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.



