పెంచికల్‌పేట్‌లో విషాదం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలంలో విషాదం జరిగింది. కల్వడ–శాలిగాం రోడ్డుపై బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఎల్కపల్లికి చెందిన శ్రావణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలవడం వల్లే శ్రావణ్ చనిపోయాడని స్థానికులు తెలిపారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు బాడీని పరిశీలించి కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.


