← Back to news

భారీ వర్షాల అలర్ట్.. సరిగ్గా పండుగ టైంలో.!

By Balasaidul· 1d ago
భారీ వర్షాల అలర్ట్.. సరిగ్గా పండుగ టైంలో.!

అల్పపీడనం ఎఫెక్టుతో AP, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం రానున్న 3 రోజులు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ నుంచి మంగళవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. తెలంగాణలో రెండు రోజుల పాటూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.

More in Politics