కాలనీలో పోలీసుల ముమ్మర తనిఖీలు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జి.బి.కె.ఆర్ ఎస్టీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కలిగిరి సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో 35మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. కలిగిరి, వింజమూరు, కొండాపురం ఎస్సైల నేతృత్వంలో కాలనీలోని ఇళ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలను తనిఖీ చేయడంతోపాటు 33 బైక్‌లు, మూడు ఆటోలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగానే చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.