వీవర్స్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎల్‌బీనగర్ వీవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంజి చిరంజీవి హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారికి పూజలు, హారతులు సమర్పించారు. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయి.