రైలు ప్రయాణాలలో ఇకపై ఒరిజినల్ టిక్కెట్ చూపాల్సిందే !

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన గమనిక! రైల్లో జర్నీ చేసేటప్పుడు మీ ఫోన్‌లో ఉండే వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు లేదా స్క్రీన్‌షాట్ టికెట్లను చూపిస్తే ఇకపై టికెట్ కలెక్టర్లు (TC) ఒప్పుకోరు. రైల్వే శాఖ తాజా నిబంధనల ప్రకారం... ప్రయాణికులు ఒరిజినల్ టికెట్‌ను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. రైల్వే యాప్ (IRCTC) ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ టికెట్ పిడిఎఫ్ (PDF) లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే అధికారిక ఎస్ఎంఎస్ (SMS) మాత్రమే చెల్లుబాటు అవుతాయి. టికెట్ల మిస్ యూజింగ్ అరి కట్టేందుకు, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.



