← Back to news

బోనాల్లో ఈవ్‌టీజర్లకు షాక్.. 678 మందిపై కేసులు

By Mahesh· 6 Aug 2026· Hyderabad
బోనాల్లో ఈవ్‌టీజర్లకు షాక్.. 678 మందిపై కేసులు

TG: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో మహిళల సేఫ్టీ కోసం షీటీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గుళ్ల దగ్గర మహిళలను వేధించిన 678 మంది ఈవ్‌టీజర్లను సీసీటీవీ ఫుటేజ్, వీడియో ప్రూఫ్స్‌తో గుర్తించి కేసులు బుక్ చేశారు. ఇంక్వైరీ తరువాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు వేశారు. 36 మందికి జైలు శిక్షతో పాటు రూ.1,050 ఫైన్ వేసింది. మరో 26 మందికి ఫైన్‌తో పాటు సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళలను హరాసింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

More in Legal