RTA ఆఫీసులో ఏసీబీ తనిఖీలు
TG: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ RTA ఆఫీసులో ఏసీబీ తనిఖీలు జరిగాయి. కొందరు ఉద్యోగుల ఫోన్లలో అనుమానాస్పద UPI లావాదేవీలు కనిపించాయి. ఏజెంట్ల దగ్గర 24,670 రూపాయలు దొరికాయి. ఏజెంట్లు తెచ్చే అప్లికేషన్లపై కొందరు ఉద్యోగులు ప్రత్యేక గుర్తులు పెట్టి, వాటిని త్వరగా పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు. 33 అప్లికేషన్లు మాయం చేసినట్లు ఇద్దరు ఉద్యోగులపై అనుమానాలున్నాయి. నగదు లెక్కిస్తున్న వీడియో బయటకు రావడంతో ఆర్టీఓ రాంచందర్, ఎంవీఐ భీమ్‌సింగ్, కానిస్టేబుల్ అరుణను సస్పెండ్ చేశారు.


