రాజాపేటలో అధ్వానంగా ప్రధాన రహదారి

వనపర్తి మండలం రాజాపేట గ్రామంలో ప్రధాన రహదారీ పూర్తిగా అద్వానంగా మారింది. స్థానిక గుడి వద్ద మెయిన్ రోడ్డు పైన పెద్దగుంత ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాలకు ఈ గుంత మరింత పెద్దదై పరిస్థితి దారుణంగా మారుతుందనీ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి ఆధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలనీ స్థానికులు కోరుతున్నారు.



