APలో కొత్త పోలీస్ కమిషనరేట్లు

AP: అమరావతిలో AP కేబినెట్ భేటీ ముగిసింది. 60కి పైగా అంశాలపై చర్చించిన మంత్రివర్గం కీలక డెసిషన్‌లు తీసుకుంది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి గ్రామాల్లో 1,548 కోట్ల పనులకు, ఇన్‌ఫ్రా కోసం అదనంగా 644 కోట్లకు ఓకే చెప్పింది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే బేబీస్ లకు 1,410 రూపాయాలు విలువైన 14 వస్తువులతో ‘NTR బేబీ కిట్’ అందించే పథకాన్ని తిరిగి తీసుకొచ్చింది.

