అభిజీత్ దిప్కే కోసం స్టేషన్ ముందు లాయర్లు

అభిజీత్ దిప్కేను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో CJP లీగల్ హెడ్ రత్నా సింగ్ న్యూఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, దిప్కేను కోర్టు ముందుకు తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ వద్ద లాయర్లు రెడీగా ఉన్నారు. తిరంగా యాత్రకు వెళ్తుండగా అరెస్టైన దిప్కే కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు విచారణ తర్వాత ఆయన రిలీజ్ లేదా రిమాండ్పై క్లారిటీ రానుంది.





