చిన్నమల్లెలలో పోషణమాసం

వేంసూరు మండలం చిన్నమల్లెలలో సెక్టార్ సూపర్ వైజర్ గంగాజలం ఆధ్వర్యంలో ‘పోషణమాసం’ నిర్వహించారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం, హెల్దీ ఫుడ్ అలవాటు చేయడం, గర్భిణుల డైట్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధనలక్ష్మి 8 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించగా, న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు.





