జలపాతం వద్ద సందడి.. పర్యాటకుల రాక!

పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలంలోని నల్లరాయిగూడ గిరిజన గ్రామం సమీపంలో ఓ అందమైన జలపాతం ఉంది. తువ్వకొండ ప్రాంతంలో వర్షాకాలంలో ఎత్తైన కొండల నుంచి నీరు జాలువారుతూ కనువిందు చేస్తోంది. ఈ అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పర్యాటకులు తరలివస్తున్నారు. మంచి టూరిస్టు ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అధికారులు తక్షణం సౌకర్యాలు కల్పిస్తే ఇది బాగా డెవలప్ అవుతుందని, తక్షణమే సౌకర్యాలు కల్పించాలని స్థానికులు అడుగుతున్నారు.. మీ ఊర్లో ఇలాంటి జలపాతం ఉందా? మీ వార్త పంపండి!



