← Back to news

HAM ప్రాజెక్ట్‌తో పులివెందులలో అభివృద్ధి పనులు

By Ram krishna· 14h ago· Pulivendula (P) Urban, Pulivendula, Y.S.R. Kadapa
HAM ప్రాజెక్ట్‌తో పులివెందులలో అభివృద్ధి పనులు

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ప్రాజెక్ట్ ద్వారా 20 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, పులివెందుల TDP ఇంచార్జి బీటెక్ రవి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో HAM ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టే పనులను సీఎం చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. పులివెందులలో CC రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

More in Local