← Back to news

1950 రాష్ట్రపతి ఉత్తర్వు 341 సవరించాలి..!

By Chakravarthy· 2d ago
1950 రాష్ట్రపతి ఉత్తర్వు 341 సవరించాలి..!

వనపర్తి జిల్లాలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సభ జరిగింది. ఎనుముల ఉసెన్ 7వ వర్ధంతి, పెరుమళ్ళ ప్రణయ్ 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవన్‌లో సభ జరిగింది. మతం మారిన దళితులకు SC హోదా, రిజర్వేషన్లు రద్దవుతాయని సుప్రీంకోర్టు చెప్పడం ఆందోళనకరమన్నారు. ఈ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్లకు SC హోదా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు 341 సవరించాలని కోరారు.

More in Local