పూలు కొనలేం.. పండుగ చేసుకోలేం

TG: తెలంగాణలో దసరా సందర్భంగా చేసే బతుకమ్మ పండుగకు విపరీతంగా పూల కొరత ఏర్పడింది. ఎల్నినో ఎఫెక్ట్తో తంగేడు పూలు చూద్దామన్నా కనిపించట్లేదు. ఇక బంతి పూల ధరలు భగ్గుమంటున్నాయి. ఇదివరకు కేజీ ₹60 ఉన్న బంతి పూల ధర ప్రస్తుతం హైదరాబాద్లో ₹300కి చేరింది. వర్షాలు లేక, సాగు కూడా తగ్గిపోయి పూల దిగుబడి భారీగా పడిపోయింది. సప్లై తగ్గి, డిమాండ్ పెరగడంతో, ధరలు షాక్ ఇస్తున్నాయి. పండుగ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.



