← Back to news

కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వంతల దేవదాసు

By B V Appalanaidu· 16h ago· Dumbriguda, Dumbriguda, Alluri Sitharama Raju
కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వంతల దేవదాసు

పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా వంతల దేవదాసు నియమితులయ్యారు. ఈ మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధికారికంగా ప్రకటించారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా దేవదాసు రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం సాగర పంచాయతీకి బీజేపీ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. రైతులను సంఘటితం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

More in Local