'దిసీజ్ Emergency': అభిజీత్ దీప్కే

అక్టోబర్ 10న జంతర్ మంతర్‌లో CJP ప్రొటెస్ట్ ఉండటంతో, దానికంటే ముందే దేశవ్యాప్తంగా 10వేల మందిని డిటైన్ చేశారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. "ఇది ఎమర్జెన్సీ" అన్న ఆయన.. పుణే నుంచి ఢిల్లీకి వెళ్తున్న విద్యార్థులను కూడా డిటైన్ చేసి, బస్సులో రహస్య ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతోందన్నారు. రేపటి ప్రొటెస్టులో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని దేశవ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటుండటం తీవ్ర కలకలం రేపుతోంది.


