← Back to news

ఇరాన్ తో సీక్రెట్ డీల్స్ గుట్టు రట్టు.. మహిళా వ్యాపారవేత్త అరెస్ట్

By aravinda nyayapati· 20 Apr 2026· Hyderabad
ఇరాన్ తో సీక్రెట్ డీల్స్ గుట్టు రట్టు.. మహిళా వ్యాపారవేత్త అరెస్ట్

ఇరాన్ కు అక్రమంగా బాంబులు, డ్రోన్లను సరఫరా చేస్తున్న ఒక మహిళా వ్యాపారవేత్తను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ మూలాలున్న షమీమ్ మాఫీ అనే బిజినెస్ ఉమెన్‌ సీక్రెట్ గా ఇరాన్ తో ఆయుధ ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం చేస్తోందని అమెరికా పోలీసులకు సమాచారం అందింది. ఒక గూఢచారిగా వ్యవహరిస్తూ నిషేధిత టెక్నాలజీని ఇరాన్ కు చేరవేస్తోందని గుర్తించారు. లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న షమీమ్ మాఫి 2025లో ఇరాన్ ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్టుగా ఆధారాలు కూడా లభించాయి.

More in World