← Back to news

అంబేద్కర్ భవనం, స్కిల్ సెంటర్‌కు MLA కూనంనేని శంకుస్థాపన

By SK RAFI· 1h ago· Bhadradri Kothagudem
అంబేద్కర్ భవనం, స్కిల్ సెంటర్‌కు MLA కూనంనేని శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి (ఎస్) గ్రామపంచాయతీలో అంబేద్కర్ భవనం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవనం పాల్వంచ ప్రజల చిరకాల కోరిక అని ఆయన చెప్పారు. స్కిల్ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. యువత అభివృద్ధి, విద్య, సామాజిక సమానత్వానికి ఇలాంటి కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు.

More in Local