గిర్నిబావి గురుకులంలో మట్టి గణపతి

వరంగల్ జిల్లాలో గిర్నిబావి మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్‌లో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య తెలిపారు. పీఓపీ, రసాయన రంగుల విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని, మట్టి విగ్రహాలతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.