PGRS రెవెన్యూ క్లినిక్ పై స్టేటస్ కో.... కలెక్టర్ ఆదేశం!

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)లో భాగంగా రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమన్నారు. PGRS కేంద్రాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించాలని సూచించారు. ప్రజలు అర్హత పత్రాలు, అవసరమైన వివరాలతో నేరుగా హాజరై అర్జీలు సమర్పించుకోవచ్చు. నేరుగా రాలేని వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.
