వీరికి ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిందే..!

జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఆందోళన చేశారు. 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. గద్వాల అగ్రహారం సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు రోడ్డెక్కారు. TRS గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇది రైతు దగా ప్రభుత్వమని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.



