డీలిమిటేషన్ బిల్లుపై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ

నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసే ముందు వెంటనే అఖిల పక్ష సమావేశం(All Party Meeting) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రధానికి ఖర్గే లేఖ రాయడం ఇది నాలుగోసారి. అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ మార్పులను సంప్రదింపులు జరపకుండా, బలవంతంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేయొద్దని లేఖలో హెచ్చరించారు.


