ఈ నెల 29న ఢీల్లీకి సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 29న ఢిల్లీ వెళ్తున్నారు. ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్చించేందుకు కాంగ్రెస్ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నారు.



