నేను బతికే ఉన్నా.. SIRపై 85 ఏళ్ల వృద్ధుడి నిరసన

‘నా వయసు 85 ఏళ్లు. నేనింకా బతికే ఉన్నాను’ అంటూ ఓ వృద్ధుడు SIR నోటీసులపై నిరసన తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్, బసవతారకనగర్ బస్తీలో ఉంటున్న అమీర్ అలీకి ఇటీవల 'సర్' నోటీసు వచ్చింది. బస్తీలో 119 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. 1996 కంటే ముందు తాను మక్తల్ నియోజకవర్గంలో ఓటరుగా ఉండేవాడినని, ఆ తర్వాత ఖైరతాబాద్లో ఇప్పటివరకు 11 ఎన్నికల్లో ఓటు వేశానని ఆయన చెప్పారు. తను బతికే ఉన్నానని ప్లకార్డు పట్టుకుని బస్తీలో నిరసన తెలిపారు.
