← Back to news

పత్తికుంటపల్లిలో దుర్గమాతకి ప్రత్యేక పూజలు

By ప్రశాంత్· 5h ago· Rajanna Sircilla
పత్తికుంటపల్లిలో దుర్గమాతకి ప్రత్యేక పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లిలో శనివారం నిర్వహించిన దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో సర్పంచ్ జుట్టు శేఖర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో గ్రామం కళకళలాడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనోహర్ రెడ్డి, జుట్టు రమేష్, పి. మహేందర్, నరేష్, సురేష్, మధుసూదన్, నవీన్, అమన్, విహాన్, రుత్విక్ తదితరులు పాల్గొన్నారు.

More in Local