మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయుల టచ్!

TG: కాకతీయుల చరిత్రను చూపించేలా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ వద్ద రేచర్ల రుద్రుడు, రాణి రుద్రమదేవి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకతీయ రాజ్యంలో సేనానిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు, పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని నిర్మించారు. తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం నాటి కళలు, శిల్పాలు కనిపించేలా ఎయిర్‌పోర్టు డిజైన్ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.



