← Back to news

సబ్‌స్టేషన్‌ ముందు బతుకమ్మ ఎందుకంటే?

By Methri Lokesh· 7 Oct 2026

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో కరెంట్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సరైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని చెబుతూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు బతుకమ్మ, పాటలు పాడుతూ అక్కడే నిరసన తెలిపారు. వ్యవసాయానికి సరిపడే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, పంటలు దెబ్బతినకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

More in TG