ప్రీ లాంచ్ పేరుతో 500 కోట్ల మోసం?

TG: HYD తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ‘ప్రీ లాంచ్’ పేరుతో డబ్బులు తీసుకున్నారని త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై ఆరోపణలు వచ్చాయి. సుమారు 350 మంది నుంచి 500 కోట్లు వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. 2021లో చదరపు అడుగుకు 1,300 నుంచి 2,600 వరకు ధర చెప్పి బుకింగ్స్ తీసుకున్నారని, ఐదేళ్లు గడిచినా పనులు మొదలుకాలేదని చెప్పారు. ప్రాజెక్టు భూమిని మరో సంస్థకు అమ్మే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.


