← Back to news

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

By NRPT· 1d ago· Mahabubabad
సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

మహబూబాబాద్‌లో రాహుల్ నగర్‌లో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ పద్మ సీతారాం నాయక్ బతుకమ్మ ఘాట్, స్మశానవాటిక నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఆయా పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

More in Local