భూ కంపాలను ప్రిడిక్ట్ చేయడంలో AI ఫెయిల్?

క్యాన్సర్ గుర్తించడం నుంచి సైక్లోన్ అంచనాల వరకూ AI అదరగొడుతోంది. కానీ భూకంపాల విషయంలో మాత్రం ఇంకా ఫెయిల్ అవుతోంది. కారణం? రికార్డులు కేవలం 150 ఏళ్లవే, పెద్ద భూకంపాలు వందల నుంచి వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఒకే ఫాల్ట్‌పై డేటా చాలా తక్కువగా ఉండటంతో AIకి ప్యాటర్న్స్ అర్థం కావడం లేదు. అందుకే ఇప్పటికీ ఖచ్చితమైన భూకంప అంచనా అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, భూకంప నిరోధక భవనాలు, కఠిన బిల్డింగ్ కోడ్స్, ప్రజల అవగాహన, వేగవంతమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌నే ప్రాణాలను కాపాడే బెస్ట్ డిఫెన్స్‌గా నిపుణులు చెబుతున్నారు.



