బ్లాక్‌చైన్ అంటే ఏంటి?

బ్లాక్‌చైన్ అనేది డిజిటల్ సమాచారాన్ని భద్రంగా దాచే టెక్నాలజీ. ఇందులో వివరాలను చిన్న చిన్న బ్లాక్‌లుగా సేవ్ చేస్తారు. ప్రతి బ్లాక్ మరో బ్లాక్‌తో లింక్ అయి ఉంటుంది. ఈ డేటా కాపీలు అనేక కంప్యూటర్లలో ఉంటాయి. దీంతో రికార్డులను రహస్యంగా మార్చడం అంత ఈజీ కాదు.బిట్‌కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీల ట్రాన్సాక్షన్స్ రికార్డు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, బ్యాంకింగ్, వస్తువుల రవాణా, డిజిటల్ ఒప్పందాల్లోనూ ఈ టెక్నాలజీని వాడుతున్నారు. డేటా భద్రత, పారదర్శకత పెంచడంలో బ్లాక్‌చైన్ కీలక పాత్ర పోషిస్తుంది.


