← Back to news

ఢీకొట్టుకోబోయిన శాటిలైట్లు

By Krishna· 2h ago
ఢీకొట్టుకోబోయిన శాటిలైట్లు

రష్యా ఆర్మీ శాటిలైట్ కాస్మోస్-2612, అమెరికా ఫిన్నిష్ ICEYE-X36 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ని ఢీకొట్టబోయింది. రష్యా శాటిలైట్‌ని ఏప్రిల్‌లో ప్రయోగించారు. సెప్టెంబర్ నుంచి దాని దిశను మార్చుతున్నారు. ఉక్రెయిన్‌కు నిఘా డేటా ఇస్తున్న అమెరికా శాటిలైట్‌కి అక్టోబర్ 18న అత్యంత దగ్గరగా వచ్చింది రష్యా శాటిలైట్. రష్యా కావాలనే ఇలా చేసిందనీ, ఇదో అంతరిక్ష యుద్ధం లాంటిదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రష్యా శాటిలైట్ దూరంగా వెళ్తోంది. దాన్ని ICEYE ట్రాక్ చేస్తోంది.

More in Technology