← Back to news

ట్యాలీపై ప్రత్యేక వర్క్‌షాప్ ప్రారంభం

By DK· 15 Jul 2026
ట్యాలీపై ప్రత్యేక వర్క్‌షాప్ ప్రారంభం

TG: ఆధునిక వ్యాపార రంగంలో అకౌంటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, విద్యార్థులు సంప్రదాయ పరిజ్ఞానంతోపాటు ట్యాలీ వంటి నూతన అకౌంటింగ్ సాంకేతికతలను తప్పనిసరిగా నేర్చుకోవాలని VC ఉమేష్‌కుమార్ సూచించారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం నిర్వహించిన అకాడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ERP9 – ఏ స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ అనే 3రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది.

More in Education