దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో 'మంచితనం'పై అకడమిక్ కోర్సు

దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో 'మంచితనం'పై ప్రత్యేక అకడమిక్ కోర్సును స్టార్ట్ చేశారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి, మానవతా దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రముఖ ఆధ్యాత్మిక, సేవా సంస్థ ‘Heartfulness Institute’, 'శ్రీరామచంద్ర మిషన్' వారు ఈ అకడమిక్ కోర్సును తయారు చేశారు. ఇందులో సిద్ధాంతపరమైన బోధనే కాకుండా ధ్యానం, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథం, సమాజానికి సేవ చేసే తత్వాలపై ప్రత్యేక కోచింగ్ ఉంటుంది.



